చాలామందికి శరీరంపై తెల్లమచ్చలు ఏర్పడి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తాయి. వంటింటి చిట్కాలతో వీటి నుండి ఉపశమనం పొందవచ్చు. పొప్పడి పండును చిన్న ముక్కలుగా కోసుకొని తెల్లమచ్చలు ఉన్నచోట బాగా రుద్దాలి. 15 నిమిషాల తర్వాత కడిగేస్తే మచ్చలు తగ్గుతాయి. అలాగే వేపాకులను రుబ్బి పేస్టుగా చేసుకొని, ఒక టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలు ఉన్నచోట రుద్ది, 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మచ్చలు తగ్గుతాయి.