సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్ వచ్చింది. తారకరత్న ఆరోగ్యంపై ఆయన బాబాయ్.. నందమూరి రామకృష్ణ స్పందించారు. సోమవారం మధ్యాహ్నం తారకరత్నను ఐసీయూలో చూసి బయటికొచ్చిన ఆయన మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. ఆయన ఆరోగ్యం నిన్న, మొన్నటితో పోలిస్తే కాస్త మెరుగుపడిందని రామకృష్ణ తెలిపారు. అవయవాలన్నీ చికిత్సకు స్పందిస్తున్నాయని చెప్పారు. అయితే ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారన్నారు. తారకత్నకు ఎక్మో పెట్టారన్న వార్తలపై రామకృష్ణ స్పందించారు. ఎక్మో పెట్టలేదని.. అవన్నీ అవాస్తవాలేనని రామకృష్ణ కొట్టిపారేశారు. రామకృష్ణ చెప్పిన ఈ ఒక్క మాట నందమూరి , నారా ఫ్యామిలీ , అభిమానులు , టీడీపీ కార్యకర్తలకు కాస్త ఉపశమనం కలిగించేదని చెప్పుకోవచ్చు.