టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర లో ఏపీ-కర్నాటక సరిహద్దులో ఓ అసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. పాదయాత్రలో కర్నాటక పరిధిలో వచ్చిన రోడ్లపై ఆ రాష్ట్ర పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. సరిహద్దు దాటి తిరిగి ఏపీలోకి అడుగుపెట్టేలోపు లోకేష్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే టీడీపీ నేతలు కర్నాటక పోలీసు లను అభినందించారు. ఈ సందర్బంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ సరిహద్దులో లోకేష్ పాదయాత్రకు కర్నాటక పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. లోకేష్ పాదయాత్రకు కర్నాటక పోలీసులు కల్పించిన భద్రత, వాళ్లు వ్యవహరించిన తీరు అద్భుతమని మరో టీడీపీ నేత అన్నారు. కర్నాటక పోలీసులను చూసి ఆంధ్రా పోలీసులు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.