కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వాళ్లు సత్యవంతులని తానేమి చెప్పడంలేదన్నారు. ఇంటి అవసరాలకు గ్రావెల్ త్రవ్వకాలు చేపడితే తప్పులేదన్నారు. టీడీపీ హయాంలో బీద రవిచంద్ర, సుబ్బానాయుడు పలు అక్రమాలకు పాల్పడ్డారని రామిరెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతలకంటే తాము చాలా మేలన్నారు. అక్కడక్కడా పురపాలకశాఖ అధికారులపై విమర్శలు వస్తున్నాయని.. ఇకపై అలాంటి ఆరోపణలకు తావులేకుండా చూస్తామన్నారు. ఎక్కడైనా ఇళ్ల నిర్మాణాల ప్లాన్లకు పురపాలక అధికారులు మామూళ్లు డిమాండు చేస్తే తన దృష్టికి తీసుకురావాలని కోరారు.