టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ గుంటూరు జిల్లాలోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. న్యాయవాదులతో కలిసి విజయ్ సీఐడీ ఆఫీస్‌లోకి వెళ్లారు. ‘‘భారతీ పే’’ యాప్ పోస్టు వ్యవహారంలో విజయ్‌కు సీఐడీ నోటీసులు ఇవ్వాగా... విచారణ నిమిత్తం ఆయన ఈరోజు సీఐడీ కార్యాలయానికి వచ్చారు. గతేడాది సెప్టెంబరులో విజయ్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ నెల 27న విచారణకు రావాల్సిందిగా విజయ్‌కు సీఆర్‌పీసీ 41ఏ కింద సీఐడీ నోటీసులు జారీ చేసింది. అయితే అదే రోజున వేరే కార్యక్రమాలు ఉండటంతో సీఐడీ విచారణకు హాజరుకాలేనని హైకోర్టులో చింతకాయల విజయ్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నేడు సీఐడీ విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. లాయర్ సమక్షంలో విచారణ జరపాలని కోర్టు సూచించింది. కోర్టు సూచన మేరకు ఈరోజు ఉదయం విజయ్ సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో కార్యాలయం వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.