మాజీ ఎమ్మెల్యే, కైకలూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ జయమంగళ వెంకటరమణకు పెను ప్రమాదం తప్పింది. వ్యక్తిగత పనిపై వెళ్లి భీమవరం నుంచి కైకలూరు వస్తుండగా కైకలూరు మండలం ఉప్పుటేరు వద్ద ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని బొలెరో వాహనం... జయ మంగళ కారును ఢీకొట్టి పరారయ్యారు. జయమంగళ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. కారు ముందు భాగం పాక్షికంగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంపై కైకలూరు రూరల్ పోలీసులకు మాజీ ఎమ్మెల్యే జయమంగళ ఫిర్యాదు చేయడంతో ఎస్సై చల్లా కృష్ణ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.