మరో రెండు వారాల్లో వివాహం జరగాల్సిన యువకుడు బావిలో శవమై తేలాడు. ఈ సంఘటన విశాఖపట్టణం, కేజే పురం వెంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం వెలుగుచూసింది. ఎస్‌ఐ పి.దామోదర్‌నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. వీరనారాయణం గ్రామానికి చెందిన ఆడారి మురళీకిృష్ణ(29) శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఇంటి నుంచి బైక్‌పై బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి దాటినా ఇంటికి రాకపోవడంతో అతని తల్లి స్నేహితులు, బంధువులను ఆరా తీశారు. అయితే వీరనారా యణం గ్రామానికి సుమారు 8 కిలో మీటర్ల దూరంలో ఉన్న కేజే పురం వేంకటేశ్వరస్వామి దేవాలయం సమీప బావి వద్ద బైక్ ఉన్నట్టు బంధువులు ఆదివారం ఉదయం గుర్తించారు. కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక అధికారి వి.రాజేశ్వర్రావు, లీడింగ్ ఫైర్‌మన్ జె.శ్రీను, పీఎస్‌ఎస్ వర్మ, ఎల్.ఫైడిరాజు, రమేశ్, నారాయణలు బావిలోకి దిగి మృతదేహాన్ని ఆదివారం మధ్యాహ్నం బయటకు తీశారు. మురళీక్రిష్ణకు ఫిబ్రవరి 9న వివాహం జరగాల్సి ఉండగా శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తండ్రి చనిపోవడంతో మురళీక్రిష్ణ జీవనోపాధికి అండమాన్ వెళ్లి పదేళ్లు ఎల క్ర్టిషియన్‌గా పని చేసి ఏడాది క్రితమే గ్రామానికి వచ్చాడని బంధువులు తెలి పారు. అయితే అతని మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తు న్నారు. మృతుడి తల్లి పైడితల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమా నాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, శవ పంచనామా అనంతరం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించామని ఎస్‌ఐ తెలిపారు. ఇది హత్య, ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.