యానాంలో మత్స్యకారులు ఎదుర్కొంటన్న సమస్యలను పుదుచ్చేరి ప్రభుత్వం పరిష్కరించాని యానాం అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం సభ్యులు ఆదివారం పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావును కోరారు. స్థానిక అగ్నికులక్షత్రియ సంక్షేమ సంఘ కల్యాణ మండపంలో నిర్వహించిన సంఘ సమావేశానికి మల్లాడి హాజర య్యారు. ఈసందర్భంగా మల్లాడికి వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా ఓఎన్జీసీ పరిహారం, సావిత్రినగర్-గిరియాంపేట మధ్యలో డంపింగ్‌యార్డ్ నిర్మాణం తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు. దీనిపై మల్లాడి మాట్లాడుతూ 15రోజుల్లో ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే, చర్చించి తరుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మత్స్యకార నాయకులు మల్లాడి శామ్యూల్, శేరు కృష్ణ, చింత వెంకటేశ్వర్లు, మల్లాడి రాజు వివిధ గ్రామలకు చెందిన మత్స్యకారులు పాల్గొన్నారు.