ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముగిసిన తెలుగుదేశం నేత చింతకాయల విజయ్ సీఐడీ విచారణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 09:20 PM

గుంటూరు సీఐడీ కార్యాలయంలో తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కుమారుడు, ఐటీడీపీ చీఫ్ చింతకాయల విజయ్ విచారణ ముగిసింది. విజయ్‌ను సీఐడీ అధికారులు 6 గంటలకు పైగా విచారించారు. భారతీ పే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తిన నేపథ్యంలో చింతకాయల విజయ్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో విజయ్‌కి నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో విజయ్ ఈరోజు విచారణకు హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa