ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంగ్లండ్ సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు ప్రకటింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 30, 2026, 09:01 PM

త్వరలో ఇంగ్లండ్ లయన్స్‌తో జరగనున్న మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా-ఏ జట్టును ఈ రోజు (ఏప్రిల్ 30) ప్రకటించారు. ఈ జట్టుకు మార్క్వెస్ అకెర్మన్‌ను కెప్టెన్‌గా నియమించారు.ఈ స్క్వాడ్‌లో పలువురు జాతీయ స్థాయి అనుభవం ఉన్న ఆటగాళ్లకు కూడా స్థానం కల్పించారు.సౌతాఫ్రికా-ఏ జట్టు మే 22 నుంచి జూన్ 9 వరకు ఇంగ్లండ్ పర్యటనలో పాల్గొంటుంది. ఈ పర్యటనలో భాగంగా రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు (టెస్ట్ ఫార్మాట్ తరహా) మరియు మూడు అనధికారిక వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఇందుకోసం జట్టు మే 16న ఇంగ్లండ్‌కు బయలుదేరనుంది.ఈ టూర్‌లో తొలుత నాలుగు రోజుల మ్యాచ్‌లు జరుగుతాయి. మే 22 నుంచి 25 వరకు అరండల్‌లో తొలి మ్యాచ్, మే 29 నుంచి జూన్ 1 వరకు బెకెన్హమ్‌లో రెండో మ్యాచ్ నిర్వహించనున్నారు.తరువాత వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. జూన్ 5న లీసెస్టర్‌లో తొలి వన్డే, జూన్ 7 మరియు 9 తేదీల్లో వార్సెస్టర్ వేదికగా రెండో, మూడో వన్డే మ్యాచ్‌లు జరుగనున్నాయి.
*నాలుగు రోజుల మ్యాచ్‌లకు సౌతాఫ్రికా-ఏ జట్టు :మార్క్వెస్ అకెర్మన్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, టోనీ డి జోర్జి, బ్జోర్న్ ఫోర్టుయిన్, జుబైర్ హమ్జా, జోర్డన్ హెర్మన్, రూబిన్ హెర్మన్, న్కోబాని మొకోయెనా, డేన్ ప్యాటర్సన్, సినేతెంబా క్వెషిలే, లెసెగో సెనోక్వానే, జేసన్ స్మిత్, ప్రెనెలన్ సుబ్రయెన్, టియాన్ వాన్ వూరెన్, కోడి యూసఫ్.
*వన్డే సిరీస్‌కు సౌతాఫ్రికా-ఏ జట్టు : మార్క్వెస్ అకెర్మన్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోట్జీ, టోనీ డి జోర్జి, కానర్ ఎస్టర్‌హుయిజెన్, డియాన్ ఫోరెస్టర్, బ్జోర్న్ ఫోర్టుయిన్, రూబిన్ హెర్మన్, క్వేనా మఫాకా, న్కోబాని మొకోయెనా, న్కాబా పీటర్, లుహాన్-డ్రే ప్రిటోరియస్, సినేతెంబా క్వెషిలే, జేసన్ స్మిత్, ప్రెనెలన్ సుబ్రయెన్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa