పాకిస్థాన్ పెషావర్‌లోని ఓ మసీదులో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడగా 63 మంది మరణించారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో ముందు వరుసలో కుర్చున్నాడని మధ్యాహ్నం 1.40 నిమిషాల సమయంలో తనను తాను పేల్చుకున్నాడని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 63 మంది చనిపోగా.. సుమారు 150 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు.