అచ్చుతాపురం: మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని ఎలమంచిలి స్పెషల్ ఎన్ఫో ర్స్మెంట్ బ్యూరో స్టేషన్ ఇన్స్పెక్టర్ జె. జనార్ధనరావు సూచించారు. సోమవారం ఇక్కడి అచ్యుతా విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఏర్పాటైన అవగాహన సదస్సులో మాట్లాడారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం అంతా కృషి చేయాల న్నారు. డ్రగ్స్ వల్ల దుష్ఫలితాలు, ప్రోత్సహిస్తే ఎదురయ్యే ఇబ్బందులను వివరించారు. విద్యా సంస్థల కరస్పాండెంట్ పల్లి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.