చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం పెద్ద ఉప్పరపల్లి గ్రామ పంచాయతీలోని రైతు భరోసా కేంద్రంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనలతో మంగళవారం నిర్వహించిన సామాజిక నేత్ర పరీక్ష శిబిరానికి విశేష స్పందన లభించినట్లు మండల వైసీపీ పార్టీ ప్రెసిడెంట్ గంగాధరం తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని వైస్ ఎంపీపీ సయ్యద్ బాషా , సర్పంచ్ భారతి గణపతి, ఎంపీటీసీ రజియా జిలాని ప్రారంభించారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కంటి వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు.