ఏపీలోని అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాటుసారా తాగి ఇద్దరు మృతి చెందారు. వెలిగల్లుకు చెందిన రవి, మొలకలచెరువుకి చెందిన రమణ మదనపల్లిలో ఉంటూ మేస్త్రి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరిద్దరు సోమవారం రాత్రి నీరుగట్టువారిపల్లిలో నాటు సారా తాగిన కొంతసేపటికి మృతి చెందారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు విచారణ చేపట్టారు. స్థానికులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.