పుల్లలచెరువు మండలంలోని పెద్ద పీఆర్సీ తండా సచివాలయం పరిధిలో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ రెంటపల్లి సుబ్బారెడ్డి మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ముందుగా యండ్రపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని మంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ శ్రేణులు పాల్గొనాలని కోరారు.