ఏపీకి విశాఖపట్నం రాజధాని కాబోతోందని సీఎం జగన్ ప్రకటించారు. మార్చిలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 కి ఆహ్వానం అందించడానికి సీఎం జగన్ న్యూఢిల్లీకి వెళ్లారు. మంగళవారం దౌత్య వేత్తల సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ 'రాబోయే రోజుల్లో విశాఖపట్నం రాజధాని అవుతుంది. నేను కూడా వైజాగ్ కి మారబోతున్నాను' అని చెప్పారు. త్వరలోనే విశాఖ నుంచి పాలనా వ్యవహారాలుంటాయని తెలిపారు.