ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను చంపేస్తామంటూ వచ్చిన కాల్స్ కలకలం రేపాయి. సోమవారం అర్ధరాత్రి బెదిరింపు కాల్స్ రాగా కేజ్రీవాల్ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. కాల్ చేసిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను మానసిక వ్యాధితో బాధ పడుతున్నాడని, ప్రస్తుతం ఢిల్లీలోని గులాబీ బాగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. విచారణ అనంతరం అతన్ని విడిచిపెట్టారు.