కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్ను బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్ల సబ్సిడీని భారీగా పెంచనున్నట్లు సమాచారం. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద ఏడాదికి 12 సిలిండర్లకు సబ్సిడీని ప్రకటించారు.