ఆంధ్రప్రదేశ్ కి విశాఖపట్నం రాజధాని అని, త్వరలో విశాఖకు మారనున్నట్టు సీఎం జగన్ ఈరోజు ఢిల్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. ఏపీ రాజధానికి సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చినప్పుడు సీఎం జగన్ ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేశారని రఘురామ అన్నారు. నిబంధనల ప్రకారం దీన్ని కోర్టు ధిక్కారంగానే పరిగణించాలి. ఏపీ సీఎం వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేలా ఉన్నాయని ఆరోపించారు. విశాఖ రాజధాని అన్న సీఎం జగన్ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.