తంబళ్లపల్లె మండలంలో కుష్టు వ్యాధి నివారణ చర్యలపై అవగాహన సదస్సుతో పాటు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని బాలిరెడ్డి గారి పల్లెలో మంగళవారం ఎంపిహెచ్ఓ రమణ అధర్యంలో సిహెచ్ఓ సుమతి కుష్టి వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ ఆసుపత్రిలో చికిత్సలు పొంది ఆసుపత్రి వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది లలితమ్మ, జాకీర్, యశోద, ఐషా, ప్రజలు పాల్గొన్నారు.