నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రం సీనియర్ సిటిజన్లకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ గరిష్ట పరిమితి రూ.15 లక్షల వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు దీన్ని రూ.30 లక్షల వరకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో సీనియర్ సిటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.