శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం బీచగానిపల్లి లో బుధవారం గడపగడప కు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ది ని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.