ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్లో జరిగిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సదస్సులో విశాఖపట్నం త్వరలో ఏపీకి రాజధాని కాబోతుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటనపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తున్నారని సీఎం వైయస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ విశాఖ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు పంచకర్ల రమేష్‌బాబు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సైతం హాజరయ్యారు.