ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పరిపాలన చేస్తే అదే రాజధాని అవుతుందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. సీఎం వైయస్ జగన్ విశాఖ రాష్ట్ర రాజధానిగా నిర్ణయించబడుతుతుందని మంచి ప్రకటన చేశారని, ఈ నిర్ణయంతో. రాష్ట్ర ప్రజలంతా సంతోషాన్ని తెలియపరుస్తున్నారని చెప్పారు. వైయస్ జగన్ నిర్ణయం అద్బుతం.. ప్రజలంతా స్వాగతిస్తున్నారు. రాష్ట్ర రాజధాని ఏదని గూగుల్ లో సెర్చ్ చేసిన విశాఖ నే చూపిస్తుందన్నారు. అన్ని రకాలుగా కనెక్టివిటీ హబ్ గా విశాఖ ఉంది. పారిశ్రామిక దిగ్గజాలు సైతం విశాఖపై ఆసక్తి చూపుతున్నారు. స్వయంగా వైయస్ జగన్ నే విశాఖలో ఉంటానని పారిశ్రామిక వేత్తలకు చెప్పారు. విశాల తీర ప్రాంతం… ఇండస్ట్రియల్ కారిడార్ గా మారబోతుంది. పోర్ట్స్, హార్బర్, జట్టీలు యుద్ద ప్రాతిపదికన నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు.