రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కు సంబంధించిన ఢిల్లీలో కర్టెన్రైజ్ కార్యక్రమాన్ని నిర్వహించామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌ను నిర్వహించనున్నామన్నారు. ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సమావేశానికి వివిధ దేశాల రాయబారులు, 49 దేశాల ప్రతినిధులు వచ్చారని చెప్పారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌తో కొన్ని దేశాలకు సత్సంబంధాలు ఉన్నాయని, వివిధ దేశాలకు చెందిన కంపెనీల పారిశ్రామిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పారు.