టీడీపీ నేత లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర ఆరవ రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా, బైరెడ్డి పల్లె మండలం బేలుపల్లెలో పని చేసుకుంటున్న భవన నిర్మాణ కార్మికుల దగ్గరకు వెళ్లి వారిని పలకరించారు. జగన్ పాలనలో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారిందని భవన నిర్మాణ కార్మికుడు ఫయాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో వెయ్యి రూపాయిలకు దొరికిన ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు అమ్ముతున్నారని తెలిపారు. మొదటి మూడేళ్లు పనులు లేక ఇబ్బందులు పడ్డామని... ఇప్పుడు పని దొరికి కూలీ వస్తున్నా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు వలన బ్రతకలేని పరిస్థితి ఉందని తమ గోడు వెల్లబోసుకున్నారు. నకిలీ ఇసుక అమ్ముతున్నారని... పైకి మాత్రమే ఇసుక కింద అంతా మట్టి పోస్తున్నారు అంటూ భవన నిర్మాణ కార్మికులు ఆవేదన వ్యక్తం చెందారు.