ఆన్ లైన్ పాఠాలు చెబుతుండగా ఓ టీచర్ ను ఇద్దరు దుండగులు గొంతు నులిమి చంపేసిన ఘటన యూపీ అంబేడ్కర్ నగర్ జిల్లాలో శనివారం జరిగింది. కృష్ణకుమార్ యాదవ్ అనే వ్యక్తి తన చెల్లెలిని ప్రేమిస్తున్న సందీప్ యాదవ్ అనే వ్యక్తికి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో సందీప్ యాదవ్ స్నేహితుడి సాయంతో కృష్ణయాదవ్ ను గొంతు నులిమి చంపేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల్ని నేడు అరెస్ట్ చేశారు.