కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం తర్వాత ప్రధాని మోదీ పార్లమెంట్‌లో ప్రసంగించారు. బడ్జెట్ పై ప్రశంసలు కురిపించారు. అమృత కాలంలో వస్తున్న తొలి బడ్జెట్ ఇదేనని.. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి బలమైన పునాదిని నిర్మిస్తుందన్నారు. ఈ బడ్జెట్ రైతులు, పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు అందరి ఆకాంక్షలను నెరవేరుస్తుందన్నారు. మహిళల కోసం ప్రత్యేక పొదుపు పథకాన్ని ప్రారంభించామని.. మహిళా సాధికారత కోసం ఎన్నో చర్యలు చేపట్టినట్లు పునరుద్ఘాటించారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని వివరించారు.