రాయదుర్గం రూరల్ వడ్రవన్నుర్ గ్రామ పంచాయతీలో నిర్మాణంలో ఉన్న దుర్గాదేవి మందిరానికి, భారతీయ జనతా పార్టీ రాయదుర్గం పట్టణ శాఖ నుండి పట్టణ ఉపాద్యక్షుడు నాని ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలు, అవసరాల పై గ్రామస్థులు పార్టీ సభ్యుల దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ఆ పంచాయితీలో లక్షలలో కేంద్రం నుండి నిధులు వస్తున్నప్పటికీ గ్రామం మురికి వాడలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్థానిక ప్రజలు తెలియజేస్తూ, ప్రస్తుతం ఉన్న సమస్యల పై స్పందించాలని, ప్రభుత్వము మా పై చేస్తున్న దౌర్జన్యాల పై మీరు కలుగజేసుకొని, మాకు న్యాయం జరిగేలా చూడాలని కోరడం జరిగిందన్నారు.