రుద్రంపేట పంచాయతీలో సాయంత్రం 34వ డివిజన్‌లో గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ బుక్‌లెట్లు అందజేశారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రజలతో అడిగి తెలుసుకుని పరిష్కార చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందిస్తున్నామన్నారు.
అనంతపురం నియోజకవర్గంలో రూ. 800 కోట్లతో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేపట్టామని. ఐదారు నెలల్లో పనులన్నీ పూర్తవుతాయన్నారు. గత ప్రభుత్వంలో టీడీపీ వాళ్లే ఎమ్మెల్యే, ఎంపీ, మేయర్లుగా ఉన్నారని. కానీ అభివృద్ధి మాత్రం చేయలేదన్నారు. ఇటీవల రూ. 25 కోట్లను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంజూరు చేశారని, త్వరలోనే డివిజన్లలో పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. టీడీపీ హయాంలో కేవలం డివైడర్లకే పరిమితం అయ్యారని విమర్శించారు. ఆలమూరు లేఔట్‌లో రుద్రంపేటకు చెందిన 640 మందికి ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం సందర్భంగా కొన్ని సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయని, వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రుద్రంపేట పంచాయతీలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ, మాజీ మేయర్ రాగే పరశురాం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, 34వ డివిజన్ కార్పొరేటర్ రమాదేవి, నిహార్, రుద్రంపేట సర్పంచ్ పద్మావతి, వైస్ సర్పంచ్ నరేంద్రరెడ్డి, ఎంపీపీ వరలక్ష్మి, వైస్ ఎంపీపీ బాలాజీ, ఎంపీటీసీ మహబూబ్‌బీ, ఓంప్రకాష్‌రెడ్డి, నారాయణమ్మ, కార్పొరేటర్లు సాకే చంద్రశేఖర్, సైఫుల్లాబేగ్, నరసింహులు, చంద్రమోహన్‌రెడ్డి, సచివాలయాల కన్వీనర్లు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి, డైరెక్టర్లు గౌస్‌బేగ్, శ్రీదేవి, శ్రీనివాసులు, వైసీపీ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, కుళ్లాయప్ప, గోవిందరెడ్డి, కృష్ణవేణి, పురుషోత్తం, తిరుపతిరాయుడు, గోపాల్‌రెడ్డి, సాదిక్, ఓబుళపతి, వార్డు సభ్యులు, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.