కడప నగరం ఎస్ఆర్ థియేటర్ సమీపంలోని ఓ బార్లో బుధవారం రాత్రి ఓ యువకున్ని దారుణంగా హత్య చేశారు. మృతుని స్నేహితుడికి తీవ్రగాయాలయ్యా యి. హత్యకు గల కారణాలు పాతకక్షలా? లేక ఏవైనా లావాదేవీలా, మరేమైనా ఇతర కారణా లు ఉన్నాయా అనే కోణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కడప డీఎస్పీ బి.వెంకటశివారెడ్డి, వన్‌టౌన్ సీఐ నాగరాజు, ఎస్ఐ పెద్ద ఓబన్న, కమాండ్ కంట్రోల్ సీఐ వెంకటేశ్వర్లు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. స్థానికులు, పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు... కడప నగరం రాజారెడ్డివీధికి చెందిన పేట నాగరాజుకు ఇద్దరు కుమారుల్లో రెండోవాడైన పేట రేవంత్ తన స్నేహితుడైన సియోన్‌పురం వాసి అభిలా్షతో కలిసి బుధవారం రాత్రి బార్‌కు వెళ్లారు. కొందరు దుండగులు అక్కడికి చేరుకుని రాళ్లతో దాడి చేసి కత్తులతో పొడవడంతో రేవంత్ పొట్టలోని పేగులు బయటికి వచ్చి తల పగిలిపోవడంతో అక్కడికక్కడే దుర్మరణం పొం దాడు. అభిలా్‌షకు కూడా గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. రేవంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ మార్చురీకి తరలించారు. కాగా హత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.