పాకిస్థాన్ మాజీ అంతర్గత శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్‌ను ఆ దేశ పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేశారు. ఆయన నుంచి మద్యం బాటిల్, ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పాక్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీను హత్య చేసేందుకు పథకం పన్నారని ఆబ్పారా పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రిని అరెస్టు చేశారు. అయితే తనను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని, తన అరెస్టు వెనుక ప్రస్తుత అంతర్గత మంత్రి రాణా సనావుల్లా పాత్ర ఉందని అహ్మద్ ఆరోపించారు.