బెల్జియం పాస్‌పోర్టులున్న దంపతులు.. ఏడాది వయసున్న బిడ్డను తీసుకుని ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆలస్యంగా వచ్చినవారు మరికాసేపట్లో బయలుదేరే బ్రస్సెల్స్ విమానంలో ఎక్కాల్సి ఉంది. అయితే సిబ్బంది వారిని ఆపి టికెట్లడిగారు. రెండు టికెట్లే చూపారు. చిన్నారికి కూడా టికెట్ కావాలనేసరికి ఇదేమిటంటూ ప్రశ్నించారు. సిబ్బందితో వాదనకు దిగారు. మరో టికెట్ కొనడానికి నిరాకరించారు. పైపెచ్చు, ష్ట్రోలర్‌పైన చిన్నారిని సెక్యూరిటీ విభాగం వద్ద వదిలేసి హడావుడిగా విమానం వైపు వెళ్లిపోబోయారు. ఈ ఆశ్చర్యకర ఘటన జనవరి 31న ఇజ్రాయెల్ టెల్‌అవీవ్‌లో బెన్ గురియన్ ఎయిర్‌పోర్టులో జరిగింది.