తమిళనాడును అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో జనజీవనం అతలాకుతలం అయింది. అల్పపీడన ప్రభావంతో సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నాగపట్టిణం, తిరువరూర్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకలోని బట్టికలోవాకు 60 కి.మీ దూరంలో, తమిళనాడులోని కరైకల్ కు 400 కి.మీ దూరంలో ఉందని వాతావరణశాఖ తెలిపింది.