కూలీల కడుపు నింపే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకంపై (ఎంఎన్‌ఆర్‌ఈజీఏ) కేంద్రం కక్ష సాధింపునకు దిగిందని చెప్పవచ్చు. ఈసారి బడ్జెట్‌లో కేటాయింపులు కుదించారు. ఈ పథకానికి అత్యంత తక్కువగా రూ.60 వేల కోట్ల నిధులను విదిల్చింది. గడిచిన ఐదేళ్లలో ఇదే అత్యల్పం. దేశంలోని ఈ పథకానికి అర్హులైన వారికి 100 రోజులు పని కల్పించాలంటే, వచ్చే ఆర్థిక సంవత్సరం కనీసం రూ. 2.72 లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయి.అయితే అవసరమైన నిధుల్లో 22 శాతం నిధులను మాత్రమే కేంద్రం కేటాయించింది.