ఓ మహిళ తన భర్తతో గొడవపడి పిల్లలకు ఎలుకల మందు పెట్టి చంపింది. ఈ దారుణ ఘటన ఉత్తర్ప్రదేశ్ షామ్లీలో జరిగింది. ముర్సలిన్, సల్మాతో 2011లో వివాహం జరిగింది. అయితే కుటుంబ కలహాలతో భర్తతో గొడవపడిన సల్మా ముగ్గురు పిల్లలకు నీళ్లలో ఎలుకల మందు కలిపి ఇచ్చింది. దీంతో వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. వారు చికిత్స పొందుతూ మృతిచెందారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.