మన దేశంలో ఐఏఎస్ అధికారి అంటే ఎంతో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. అందరితో ఎంతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారు. అయితే బీహార్ కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి తన కింది స్థాయి అధికారిని అసభ్యకరంగా తిట్టిన వీడియో బయటకు వచ్చింది. బీహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేకే పాఠక్ ఓ మీటింగ్ లో డిప్యూటీ కలెక్టర్ ను అసభ్యకరంగా మందలించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.