శింగనమల పోలీసు స్టేషన్ ను ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, నేరాలు, శాంతిభద్రతలపై సమీక్షించారు. పోలీస్ స్టేషన్లోని లాకప్ గది, కంప్యూటర్ గది, రిసెప్సన్ సెంటర్ , తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీసు స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పని తీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్ లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్ మరియు వివిధ క్రైమ్ రికార్డులను సమీక్షించారు. పోలీసు స్టేషన్లో కమ్యూనికేషన్ వ్యవస్థ, ఆ పరికరాల పనితీరును చెక్ చేశారు. పోలీసు స్టేషన్లో జనరల్ డైరీ ను ఎస్సై రాయాలని సూచించారు. జిల్లా ఎస్పీతో పాటు శింగనమల సి. ఐ అస్రార్ బాషా, ఎస్సై శ్రీనివాసులు, తదితరులు ఉన్నారు.