గురువారం ఉరవకొండ పట్టణంలోని స్థానిక సెంట్రల్ జిల్లా ఉన్నత పాఠశాలలో పురాతన నాణ్యాలు ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 175 దేశాల నాణ్యాలు, నోట్లను పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు నాగభూషనం సేకరించారు. మగధ సామ్రాజం కాలం నుండి నేటి ఆజాద్ కా అమృత్ మహోత్సవం వరకు రిలీజ్ అయిన కాయిన్లను ప్రదర్శన చేశారు. అక్బర్, షాజహాన్, ఔరంగజేబు కాలంలో వాడిన నాణ్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. పట్టణంలోని ప్రయివేటు పాఠశాలల నుండి వందలాది మంది విద్యార్థులు ఈ ప్రదర్శనను తిలకించారు.