నాయుడుపేట పట్టణంలో గురువారం వైకాపా సీనియర్ నాయకులు ఓడూరు సుందర్ రామిరెడ్డి ఉత్తర క్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు వైకాపా నేతలు ఘనంగా నివాళులర్పించారు.
తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, చెంగాలమ్మ ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, కళత్తూరు రామ్మోహన్ రెడ్డి, కళత్తూరు శేఖర్ రెడ్డి, కళత్తూరు జనార్ధన్ రెడ్డి తదితరులు ఆయన చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
అనంతరం సుందర రామిరెడ్డి కుమారుడు గిరిధర్ రెడ్డి ఆయన సోదరుడు ముద్దు కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైకాపా లో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.