ప్రైవేట్ విద్యా సంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు అండగా ఉంటామని తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఒంగోలులో జరిగిన ప్రైవేట్ విద్యాసంస్థల ఆత్మీయ సమ్మేళనంలో బుధవారం సాయంత్రం ఆయన పాల్గొన్నారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. మరో ఎమ్మెల్సీ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.