తుగ్గలి మండల, పరిధిలోని జొన్నగిరి గ్రామంలో గురువారం ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వము అందిస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నామని అన్నారు. జగనన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులైన 30 మంది రజక సంఘాల కుటుంబాలను కండువా కప్పి వైఎస్ఆర్ సీపీలోకి చేర్చుకున్నారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.