గురువారం కూడేరు సచివాలయం-2 పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గిరిజమ్మ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. అదే విదంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకునే నూతన ఒరవడికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. పారదర్శక పాలన అంటే ఇదే అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.