అదానీ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన రుణాల వివరాలను తెలియజేయాలని ఆర్బీఐ అన్ని బ్యాంకులను కోరింది. ఈ గ్రూప్ కంపెనీల క్యుములేటివ్ మార్కెట్ వాల్యుయేషన్‌లో 100 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోవడంతో ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రభుత్వ, బ్యాంకింగ్ వర్గాలు ధృవీకరించాయని ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. అయితే ఈ విషయాన్ని ఆర్బీఐ అధికారికంగా వెల్లడించలేదు.