నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నాయకత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ కోఆర్డినేటర్గా ఆదాల ప్రభాకర్ రెడ్డిని జగన్ నియమించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రితో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇన్ ఛార్జిగా నియమించడం సంతోషంగా ఉందని ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. వైసీపీ గెలుపునకు కృషి చేస్తానన్నారు.