తిరువూరు లో పునర్నిర్మించిన శ్రీ కోదండ రామాలయానికి అశోక్ నగర్ కు చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి గుదే. రామారావు, భారతి దంపతులు, వారి కుమారుడు రవితేజ తో కలసి రూ. 50000 విలువ గల కంచు గంటను గురువారం బహుకరించారు. భక్తులు గంట మ్రోగించినపుడు ఓంకార నాదం ధ్వనించటం ఈ గంట ప్రత్యేకత. ఈ కార్యక్రమం లో ఆలయ ధర్మకర్త సోమవరపు సత్యనారాయణ, వేంకటాచల దేవస్దానం ఛైర్మన్ అనుమోలు ముత్తారావు తదితరులు పాల్గొన్నారు.