జగ్గయ్యపేట నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ మరియు చేతి వృత్తి స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో జగ్గయ్యపేట పట్టణంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం వద్ద ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ బుధవారం రోజు పార్లమెంటు బడ్జెట్లో ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ పథకం ప్రవేశపెట్టిన శుభ సందర్భంలో విశ్వకర్మ భగవానుడి చిత్రపటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. తధానంతరం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం వివిధ రాష్ట్రాలలో, విశ్వబ్రాహ్మణ, స్వర్ణకారులు వివిధ రకాల పనిచేసే విశ్వకర్మ వర్గాల వారు ఈ పథకంతో లబ్ధి పొందవచ్చు. అర్హులైన వారందరికీ కావలసిన సామాగ్రి ఆర్థికంగా చేతి వృత్తి వారందరికీ కావలసిన సామాగ్రి, ఆర్థికంగా ఎదుగుదలకు లోన్లు సదుపాయం కలదు. ఇందుకు అవసరమైన శిక్షణ అందిస్తుంది. ఈ పథకం ద్వారా దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలకు లబ్ధి పొందే అవకాశం కలుగుతుందని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ రాజా రామకృష్ణ వర్మ, ఎన్టీఆర్ జిల్లా ఎగ్జిక్యూట్ మెంబర్ కొప్పు సత్యనారాయణ, జిల్లా ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షులు సిమ్మసత్తి శ్రీనివాస్, జగ్గయ్యపేట మండల పూర్వ అధ్యక్షులు చేపూరి వెంకటాచారి, వేద సుబ్రహ్మణ్యం మరియు స్వర్ణకారుల సంఘం నాయకులు, బ్రహ్మోజు శశిధర్, పిన్నెల్లి నాగభూషణం, తూమాటి వీరాచారి, వెంకటరమణ చారి, వీరభద్ర చారి, బ్రహ్మచారి, గుంటుపల్లి రమేష్, ప్రసాదు, చిన్న, వెంకటాచారి, వాసుదేవ తదితరులు పాల్గొనడం జరిగింది.