వివేక హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. సీఎం జగన్ సోదరుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి కి నోటీసు ఇచ్చి విచారించింది. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టెన్షన్ పడుతున్నట్లు అర్థమవుతోంది. సీబీఐ కడప జిల్లాలో అడుగు పెట్టినప్పటి నుంచి సీఎంలో టెన్షన్ మొదలైంది. కేసులో అవినాష్ రెడ్డిని కాపాడుకునేందుకు పరిపాలన గాలికొదిలేసి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.