అమెరికా ఒకే దెబ్బతో 2 పిట్టలకు గురి పెట్టిందని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది. భారత్‌ను తన మిత్ర దేశంగా చేసుకోవడం ద్వారా స్వప్రయోజనాలను సాధించడంతో పాటు ఆ దేశాన్ని పావుగా వాడుకుని చైనా వృద్ధిని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని ఆక్షేపించింది. భారత్-అమెరికాల మధ్య అత్యంత కీలకమైన ఒప్పందం ICETపై అక్కసు వెళ్లగక్కుతూ ఈ కథనం సాగింది.