రాహుల్‌గాంధీతోనే దేశాభివృద్ధి సాధ్యమని శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కె.సింహాద్రినాయుడు అన్నారు. గురువారం దేవరాపల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ పాలనతో దేశవ్యాప్తంగా ప్రజలు విసుగు చెందారని, వీరంతా రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. మతతత్వాన్ని దేశభక్తిగా ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకొంటున్న బీజేపీని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని చెప్పారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటున్నట్లు జోడో యాత్రతో స్పష్టమయ్యిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కె.లక్ష్మీ, కొత్తకోట్ల జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.